Telugu dimers welcome here for Hyderabad/ Andhra pradesh deals and discussions
- 4123219
- 85340
-
- Last Comment
తెలుగులో డబ్బింగ్ చేసిన హాలీవుడ్ థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయడం అలవాటు. అవెంజెర్స్ ఇన్ఫినిటీవార్, ఎండ్ గేమ్, కేప్టెన్ మార్వెల్, టెర్మినేటర్ డార్క్ ఫేట్, జుమాంజి ఇలా ఎన్నో మూవీస్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను. మార్వెల్ స్టూడియోస్ మూవీస్‌లో ఐరన్‌మ్యాన్‌గా కనిపించే యాక్టర్ రాబర్ట్ డౌనీ నటించిన డులిటిల్ మూవీని తెలుగులో చూడొచ్చని యూట్యూబ్‌లో తెలుగులో అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసి చాలా ఆశ పెట్టారు. రేపు (17th jan 2020) రిలీజ్ అవ్వబోతోంది. తెలుగు డబ్బింగ్లో థియేటర్లో చూడొచ్చని సంబరపడ్డా. తీరా చూస్తే తెలుగులో రిలీజ్ అవుతున్నట్లు ఎక్కడా కనిపించట్లేదు. మా ఊర్లో పోస్టర్లు అతికించారేమోనని వెతికా. కనిపించలేదు. పేటీయమ్లో కూడా చెక్ చేసా, మూవీ కనిపించలేదు. లొకేషన్‌ను హైదరాబాద్‌కి మార్చి చూస్తే మూవీ కనిపించింది కాని తెలుగు డబ్బింగ్ లేదు. ఇప్పుడు మూవీ చూడటానికి హైదరాబాద్ దాకా వెళ్లలేను. ఒకవేళ వెళ్లినా, తెలుగులో చూసినంత ఎంజాయ్మెంట్ ఇంగ్లీష్‌లో ఉండదు. చేతిలో ఎంత క్యాష్ ఉన్నా, కొన్నిసార్లు మనం కోరుకున్నది పొందడానికి రాసి పెట్టి ఉండాలి అనేదానికి ఇదొక నిదర్శనం
ఇవాళ నాకొక ట్రిక్ తెలిసింది నాకు ప్రతి రోజు పార్క్‌కి వెళ్ళి స్పీడ్‌గా వాకింగ్ చేయడం అలవాటు. పచ్చని మొక్కల మధ్య, గోరువెచ్చని సూర్యకాంతిలో వేగంగా వాక్ చేస్తూ శరీరం చెమటతో తడిసేలా వేగంగా వాకింగ్ చేస్తుంటాను. పార్క్‌లో ఎన్విరాన్మెంట్ కూడా చాలా అందంగా బాగుంటుంది. ముఖ్యంగా వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. కాని వాకింగ్ సమయంలో నేను ఫేస్ చేసే అతి పెద్ద సమస్య జనం! నాలాగా చాలా మంది వాకింగ్ చేస్తుంటారు కాని నిదానంగా… పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఒకరిపక్కన ఒకరు నడుస్తూ మిగతావారికి చోటులేకుండా దారి మూసుకుపోయేలాగా! ఓ ముగ్గురు నలుగురు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పక్కపక్కనే నడుస్తూ నెమ్మదిగా వెళ్తుంటారు. వెనక నుంచి వేగంగా నడుచుకుంటూ వచ్చేవారు ముందుకు పోవడానికి దారి ఉండదు! ఒక పక్కగా నడిస్తే ఏ ఇబ్బందీ ఉండదు కాని ట్రాక్ మధ్యలో… అది కూడా పక్కపక్కనే వెళ్తుంటారాయే. ఇక వేగంగా వాక్ చేసుకుంటూ వచ్చే నాబోటివాడు ముందుకు వెళ్లే దారి లేక వాళ్ల వెనకే నెమ్మదిగా వాక్ చేయాల్సి వస్తుంది. ఎవడు ఈ వెధవ, నా వెనకే నడుస్తూ వస్తున్నాడు అని లేడీస్ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. కొంచం సైడ్ ఇవ్వండి అని అడగవచ్చుగా? అని మీకు అనిపించే ఉంటుంది. ఏదో ఇద్దరో, ముగ్గురో అయితే కొంచం తప్పుకోండని అడగొచ్చు, కాని జనంలో దాదాపు అలా నడుచుకునేవారే! ఎంతమందిని అడగాలి “సైడ్ ఇవ్వండి సైడ్ ఇవ్వండి” అని! లేదంటే ఒక హారన్ తీసుకువెళ్లి హారన్ కొట్టుకుంటూ వాకింగ్ చేయాలి… హిహి అందుకే, దారికి అడ్డంగా నడిచే జనం బాధ పడలేక పార్క్‌లో రద్దీ పెరగకముందే, అంటే వాకింగ్ ట్రాక్‌లో పెద్దగా జనం ఇంకా రాక ముందే గబగబా వాకింగ్ చేసి కంప్లీట్ చేస్తుంటాను. ట్రాక్ ఖాళీగా ఉన్నప్పుడే దూసుకుపోవాలి మరి! కాని కొన్నిసార్లు మిగాతా వర్క్ వలన పార్క్‌కి వెళ్లేసరికి లేట్ అయిపోతుంది! జనం పెరిగిపోతారు. అడ్డంగా నడిచేవారు కూడా ఎక్కువైపోతారు. ఇలాంటి టైమ్‌లో వేగంగా వాకింగ్ చేయడం కష్టం అవుతోంది. కాని ఈ రోజు అసలు సంగతి బయటపడింది. నేను ఎంత స్పీడ్‌గా వాకింగ్ చేసినా కూడా నా నడక చప్పుడు కావట్లేదు… నా నడక సైలెన్స్‌గా ఉండటంతో “వెనక ఒకరు వాకింగ్ చేస్తూ వస్తున్నారు, కాస్త సైడ్ జరగాలి” అని జనం కనిపెట్టలేకపోతున్నారని నోటీస్ చేసాను. నడక చప్పుడు వచ్చేటట్లు గట్టిగా నడవడం మొదలెట్టాను. ప్రాబ్లమ్ హుష్‌కాకి! ఇప్పుడు నా నడక శబ్ధం విని అడ్డుగా నడిచేవారు తప్పుకుంటున్నారు. దాంతో బాగా జనంలో కూడా హ్యాపీగా, స్పీడ్‌గా వాకింగ్ ఎంజాయ్ చేస్తున్నాను
DP lo kuda walking chestunaru..
mari ekuavaga chestunaremo, konchem chusukondi..
బుజ్జి టామ్ & జెర్రీ తెలుగులో మాట్లాడటం చూస్తానా అని చాలా ఎక్సయిట్మెంట్గా ఉంది. 😅 💖
Credit card to cash
Best way evariana chepthara
30k rotate cheyali
Someone tell me default dns of excitel
Evaranna myntra gvs ammuthunnara reputed aithe cheppandi
Add me in telugu group
Any telugu people here..please come and comment.
sabaku namaskaram
Wassup Wassup rowdy boys ani piluvu bhayya, andaru vachestaru
Chala baga cheparu meeru excellent.. 100% meeru chepindi correct.
Hi Guys,
Anyone tried magicpin vday1000 code in hyd?
Evvadu kodte dimma tirigi mind block aipoddo aade pandu gadu
Evarina moto one vision vadthunara?
Btw we have the parent thread here → https://www.desidime.com/forums/dost-and-dimes/...
dhanki father and mother nuvvey ga
Idhi endhayya idhi nen soodala. Ammababoyi 8455 pages 1.1M hotness mana telugolu ey
I am from Karnataka, but loves Telugu people, they are very kind & jovial